క్రైమ్/లీగల్

పులి చర్మం, గోళ్లు స్మగ్లింగ్ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, ఏప్రిల్ 15: గుట్టు చప్పుడు కాకుండా నగరానికి పులి చర్మం తీసుకువచ్చి విక్రయిస్తున్న ముఠా సభ్యులను మల్కాజిగిరి ఎస్‌వోటి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నేరేడ్‌మెట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. ఒడిస్సా రాష్ట్రం చండూవ గ్రామానికి చెందిన బాసుదేవ్ మస్తీ(23), జగన్నాధ్ సీసా(19), బాలి పంగి (26) విశాఖపట్నం మధురవాడకు చెందిన నాగొతి బాను(24) పది మందితో ముఠాగా ఏర్పడి సిరుపూర్ కాగజ్‌నగర్, మహారాష్ట్ర తాడోబా, చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, వైజాగ్ అడవులలో విద్యుత్‌వైర్ల ద్వారా అడవులలో సంచరించే వన్యప్రాణులను వేటాడుతున్నట్టు సీపీ తెలిపారు. మార్కెట్లో పులి చర్మాలకు ఎక్కువ ధర ఉందని తెలుసుకుని పులులను వేటాడి వాటి చర్మం వలిచి మధ్యవర్తుల ద్వారా పులి చర్మం, గోళ్లు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఒడిస్సా నుంచి పులి చర్మం, గోళ్లు కారులో తీసుకువచ్చి ఎల్‌బీనగర్‌లోని మయూరి హోటల్‌లో కొనుగోలుదారుల కోసం వేచిచూస్తున్న ముఠా సభ్యులను విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్‌వోటి పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకుని కారు డిక్కీలో దాచిన పులి చర్మం, గోళ్లతో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు. సమావేశంలో అడిషినల్ డీసీపీ సురేందర్ రెడ్డి, ఫారెస్టు అధికారులు శివయ్య, రమేష్ కుమార్, నవీన్‌కుమార్, రత్నం, శ్రీశైలం పాల్గొన్నారు.