క్రైమ్/లీగల్

బీసీ రిజర్వేషన్లను తగ్గించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: రాజ్యాంగ విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న పంచాయతీరాజ్ చట్టాన్ని సవాల్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. బీసీ రిజర్వేషన్లను తప్పుల తడకగా చేసి బీసీలకు అన్యాయం చేసే జీవో 81ను రద్దు చేయాలని , బీసీ జనాభా లెక్కలు తీసిన తర్వాతనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని హైకోర్టును కోరింది. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ముప్పైరెండు సంవత్సరాలుగా అమలులో ఉన్న 34 శాతం బీసీ రిజర్వేషన్లను అక్రమంగా 18 శాతానికి కుదిస్తూ తయారుచేసిన సవరణ బిల్లు ద్వారా తలపెట్టిన ఎంపీటీసీ, జడ్‌పీటీసీ రిజర్వేషన్లను తగ్గించవద్దని , ఆ సవరణ బిల్లును కొట్టివేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు 50 శాతం సీలింగ్ అనే ప్రాతిపదికగా బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి సాంకేతికంగా 23 శాతానికి కుదిస్తూ బిల్లును ప్రవేశపెట్టి, అమలులో మాత్రం మరింత కుదించి 18 శాతానికి నిర్ధారించి 535 మండలాలకు గానూ 96 మండలాలు, 33 జిల్లాల్లో ఆరు జిల్లా ప్రజాపరిషత్‌లను బీసీలకు కేటాయించిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 340 ప్రకారం 1951 అమ లు మార్గదర్శకాలు ప్రకారం రాష్ట్రంలో దేశంలో వివిధ కమిష్ల సిఫార్సు ప్రకారం అందుబాటులో ఉన్న జనాభా ప్రకారం ఆనాటి ఎన్టీఆర్ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లను కేటాయించి 1987 నుండి అమలుచేస్తోందని, 1986-87లో ప్రజా బీసీ ఉద్యమాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు వివిధ బెంచ్‌లు రిజర్వేషన్లను సమర్ధించాయని పేర్కొన్నారు.