క్రైమ్/లీగల్

డీసెట్‌కు ‘ఒకేషనల్’ అర్హులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: రెండేళ్ల డీసెట్ కోర్సులో చేరేందుకు ఇంటర్మీడియట్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్ధులను సైతం అనుమతించాలని రాష్ట్ర హైకోర్టు విద్యాశాఖను ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఏ రాజశేఖరరెడ్డిలతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలు ఇచ్చిందని తెలంగాణ ఒకేషనల్ విద్యార్ధులు, నిరుద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జీ ప్రభాకర్, డీ నాగరాజులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఒకేషనల్ విద్యార్థులు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించేందుకు వీలుకల్పించాలని వారు పాఠశాల విద్యాశాఖ అధికారులను కోరారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు వీలుగా చివరి తేదీని మరో 15 రోజులు పొడిగించాలని వారు కోరారు. విద్యార్ధుల తరఫున సుంకర చంద్రయ్య పిటీషనర్ల తరఫున వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరఫున డీఎల్ పాండు తమ వాదనలు వినిపించారు.