క్రైమ్/లీగల్

తిరువళ్లూరు చెక్‌పోస్టు వద్ద 1,381 కిలోల బంగారాన్ని పట్టుకున్న స్క్వాడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 17: తమిళనాడులో గురువారం నాడు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో తిరువళ్లూరు చెక్‌పోస్టు వద్ద ఒక వాహనంలో 1,381 కేజీల బంగారం ఉండటాన్ని బుధవారం సాయంత్రం గుర్తించారు. వెంటనే ఈ బంగారాన్ని పూనమలై ట్రెజరీకి తరలించారు. ఈ బంగారు టీటీడీ గత మూడు సంవత్సరాల క్రితం పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు విచారణలో తేలింది. శ్రీవారి భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా సమకూరుతున్న బంగారాన్ని టీటీడీ పలు జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో గత మూడు సంవత్సరాల క్రితం చెన్నై పంజాబ్‌నేషనల్ బ్యాంకులో 1316 కేజీలను డిపాజిట్ చేసింది. మూడు సంవత్సరాల కాలపరిమితి తీరడంతో టీటీడీ జమచేసిన బంగారానికి 75కేజీలు వడ్డీ రూపంలో సమకూరింది. దీంతో 1381 కేజీల బంగారు మొత్తాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకు టీటీడీకి అప్పగించేందుకు బుధవారం చర్యలు చేపట్టింది. తమిళనాడులో ఎన్నికల జరుగుతున్న సమయంలో ఎన్నికల కమిషన్‌కు కూడా ఈ బంగారు తరలింపు గురించి బ్యాంకు అధికారులు లిఖితపూర్వకంగా తెలియజేశారు. అయితే బుధవారం తిరువళ్లూరు చెక్‌పోస్టు వద్ద పోలీసు, ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో తిరుపతికి వస్తున్న వాహనంలో ఉన్న 25కేజీల బరువు కలిగిన 55 బాక్సులను గుర్తించారు. అయితే వాహనంలో ఉన్న సిబ్బంది ఇచ్చిన సమాచారాన్ని అధికారులు పరిగణలోనికి తీసుకోకుండా మొత్తం బంగారాన్ని పూనమలై ట్రెజరీకి తరలించారు. ఈ విషయం బయటకి పొక్కడంతో మీడియాలో హడావుడి జరిగింది. ఒక దశలో టీటీడీ అధికారులు కూడా ఆందోళన చెందారు. అయితే బ్యాంకు అధికారులు మాత్రం ఇది మీడియాలో జరిగిన హడావుడి తప్ప ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు. అంతేకాకుండా తమ బ్యాంకులో టీటీడీ జమచేసిన బంగారాన్ని అధికారులకు స్వాధీనం చేసేంత వరకు ఆ బాధ్యత తమదేనని స్పష్టం చేస్తున్నారు. తాము తరలిస్తున్న బంగారానికి సంబంధించి అన్ని రకాల పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని, ఈ విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని బ్యాంకు అధికారులు టీటీడీ అధికారులకు ధీమాగా చెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా 1381 కేజీల బంగారు పట్టివేతపై తీవ్ర చర్చనీయాంశమైంది.
చిత్రం... తిరువళ్లూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం ఉన్న బాక్స్‌లు