క్రైమ్/లీగల్

తమిళనాట రూ.1.48 కోట్లు స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 17: ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచుకున్న కోటీ 48 లక్షల నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏఎంఎంకె పార్టీ టీటీవీ దినకరన్ మద్దతుదారుల నుంచి ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని థేనీ జిల్లాలోని అందిపట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి గురువారం ఉప ఎన్నిక జరగనున్నది. ఈ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఈ డబ్బును 94 ప్యాకెట్లలో, ఎన్వలప్ కవర్లలో సిద్ధం చేశారు. ఒక్కో ఓటరుకు రూ.300 ఇచ్చేలా సిద్ధం చేసినట్లు ఐటీ శాఖ డైరెక్టర్ జనరల్ (ఇనె్వస్టిగేషన్స్) బీ. మురళీ కుమార్ తెలిపారు. ఆ పార్టీ కార్యాలయం ఆవరణలో డబ్బులు ఉన్నట్లు పక్కా సమాచారం ఉండడంతో దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ సమయంలో ఆ పార్టీ కార్యకర్తలు తమను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఘటనను రికార్డు చేశామని, ఇంకా సదరు వ్యక్తి స్టేట్‌మెంట్‌నూ రికార్డు చేయడం జరిగిందని చెప్పారు. పోలీసులు గాలిలోకి జరిపిన కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని, ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. సదరు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశామని ఆయన చెప్పారు.