క్రైమ్/లీగల్

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఏప్రిల్ 18: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, పోలీసు బలగాలకు మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు సహా ఇద్దరు మావోలు హతమయ్యారు. మరో మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. రెండవ విడత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్, రాజ్‌నందన్‌గామ్, మహాసముంద్ లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో భద్రతా బలగాలు పటిష్ట బందోబస్తు చేపట్టాయి. ఈ క్రమంలో దంతెవాడ జిల్లా డౌలీకర్కా గ్రామ శివారు అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ (డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్) కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో డీఆర్‌జీ బలగాలను గమనించిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. బలగాలు మావోయిస్టుల కాల్పులను తిప్పికొట్టేందుకు ఎదురుకాల్పులకు దిగాయి. కాల్పుల అనంతరం మావోలు అడవుల్లోకి పరారయ్యారు. సంఘటన స్థలం వద్ద ఒక మహిళ సహా మరో మావోయిస్టు మృతదేహంతో పాటు 315 బోర్‌గన్ లభ్యమైంది. సంఘటన అనంతరం మృతుల వివరాలను యాంటీ నక్సల్స్ ఆపరేషన్ డీఐజీ పి.సుందర్‌రాజ్ వెల్లడించారు.
మృతుల్లో వర్గీస్‌తో సహా లింగా అనే మహిళా మావోయిస్టు ఉన్నారని తెలిపారు. మరో మావోయిస్టు దస్రు తీవ్రంగా గాయపడ్డాడని, అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వీరు ఇటీవల దంతెవాడలోని కౌకొండ వద్ద భాజపా ఎమ్మెల్యే భీమా మాండవిని అంబూష్ వేసి హతమార్చిన ఘటనలో పాలుపంచుకున్నారని తెలిపారు. వర్గీస్ మల్కన్‌గిరి ఏరియా కమిటీ సభ్యుడు కాగా, లింగా కటేకళ్యాణ ఏరియా కమిటీలో ఎల్‌వోఎస్ సభ్యురాలిగా కొనసాగుతుందని, వీరు ఎమ్మెల్యే సహా ఐదుగురు భద్రతా బలగాలను హతమార్చిన ఘటనలో పాల్గొన్నారని తెలిపారు. వీరిపై పలు కేసులు ఉన్నాయని, వర్గీస్‌పై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. కూంబింగ్ కొనసాగుతుందని డీఐజీ పేర్కొన్నారు.