క్రైమ్/లీగల్

ప్రేమ జంట ఆత్యహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలకొండపల్లి, ఏప్రిల్ 18: రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన తాండ్ర మల్లేష్(19), భాషమోని శిల్ప(17) ప్రేమ జంట బుధవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తలకొండపల్లి ఎస్సై సురేష్ యాదవ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఒకే కులానికి చెందిన మల్లేష్, శిల్ప గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఒక సంవత్సరం ఆగితే చేస్తామని, ఇపుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని శిల్ప తల్లిదండ్రులు చెప్పినా వినకుండా తొందరపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం సాయంత్రం శిల్ప అక్క ఊరైన మధాయిపల్లికి వెళ్లి శిల్పను బలవంతంగా తన వెంట తీసుకొని మల్లేష్ వెళ్లిపోయాడు. గురువారం తెల్లవారుఝామున మల్లేష్ చిన్నాన్న కృష్ణ.. పొలం వద్దకు వెళ్లి చూడగా క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తలకొండపల్లి ఎస్సై కేసు నమోదు చేసి మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.