క్రైమ్/లీగల్

ద్విచక్ర వాహనం ఢీకొని సైక్లిస్ట్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, ఏప్రిల్ 24: ద్విచక్ర వాహనం ఢీకొని సైకిల్‌పై వెళుతున్న వృద్ధుడు మృతి చెందిన సంఘటన స్థానిక పోలీసు స్టేషన్ పరిధిలోని రామానగరం క్లబ్ రోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో జరిగింది. అదే ప్రాంతంలో నివశిస్తున్న నాదెళ్ల శేషగిరిరావు(79) సెంటర్‌కు వచ్చి సైకిల్‌పై తిరిగి ఇంటికి వెళుతుండగా శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో అటు నుండి వస్తున్న బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శేషగిరిరావు తలకు బలమైన గాయం కాగా 108 అంబులెన్స్‌లో చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బైక్‌పై ముగ్గురు యువకులు ఉండగా బైక్ నడుపుతున్న కిషోర్ అనే యువకుడికి గాయాలు కాగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొలుత గుర్తు తెలియని ద్విచక్ర వాహనంగా భావించినప్పటికీ తరువాత దర్యాప్తులో గుర్తించగలిగారు. ఘటన స్థలాన్ని అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు, చల్లపల్లి సీఐ ఎన్ వెంకట నారాయణ, ఎస్‌ఐ శ్రీనివాసరావు పరిశీలించారు. మృతుడి కుమారుడు వేమనరావు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీఆర్‌ఓ రాజేంద్ర పంచనామ నిర్వహించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.