క్రైమ్/లీగల్

యాసిన్ మాలిక్‌కు జుడీషియల్ రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కాశ్మీర్‌లో వేర్పాటు వాదలకు ఆర్థిక సాయం అందిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్‌ను అడిషినల్ సెషన్స్ కోర్టు జుడీషియల్ రిమాండ్‌కు పంపింది. వచ్చేనెల 24వ తేదీ వరకూ జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండాలని న్యాయమూర్తి రాకేష్ సయాల్ ఆదేశించారు.
భద్రతా కారణాలతో యాసిన్ మాలిక్‌ను కోర్టుకు తీసుకురావడం సాధ్యం కాదని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ నిర్వహించాలని తీహార్ జైలు అధికారులు చేసిన విజ్ఞప్తిపై కోర్టు స్పందిస్తూ, అతనిని ఎన్‌ఐఏ కస్టడీకి ఇవ్వాలని ఆదేవించింది. ఎన్‌ఐఏ విచారణ కోసం కాశ్మీర్ నుంచి యాసిన్ మాలిక్‌ను న్యూఢిల్లీకి తీసుకొచ్చారు. సుమారు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలో దోషిగా ఉన్న యాసిన్ మాలిక్‌కు శిక్ష ఖరారైతే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈ కారంగానే ఎన్‌ఐఏ కూడా విచారణను వేగవంతం చేసింది.