క్రైమ్/లీగల్

ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 24: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి సమీపంలోని ఐనవోలు మండలం పంథిని శివారు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు దుర్మరణం చెందారు. ఒకే బైక్‌పై వెళ్తున్న ముగ్గురు విద్యార్ధులు వారు నడుపుతున్న వాహనం అదుపు తప్పడంతో చెట్టుకు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు వర్ధన్నపేటకు చెందిన వారు కాగా మరొకరు ఇల్లందకు చెందిన వారు. ఈ ముగ్గురు కూడా చిన్నప్పటి నుండి కలసి చదువుకుని స్నేహితులుగా ఉన్నారు. మృతుల్లో వర్ధన్నపేటకు చెందిన బిక్కినేని మురిళీధర్‌రావు, మావిళ్లపల్లి ఆధిత్య, ఇల్లందకు చెందిన గొడిశాల రామ్‌సాయిగా గుర్తించారు. ఈ ముగ్గురు బీటెక్ చదువుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రం... ప్రమాద స్థలంలో పడి ఉన్న మృతదేహాలు