క్రైమ్/లీగల్

14 ఏళ్ల తర్వాత చలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారన్న అభియోగాల కేసులో టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, ఎన్టీరామారావు భార్య లక్ష్మీపార్వతి అవినీతి నిరోధక శాఖ కోర్టులో ఆంధ్రముఖ్యమంత్రి చంద్రబాబుపై దాఖలు చేసిన ఫిర్యాదుకు 14 ఏళ్ల తర్వాత చలనం వచ్చింది. ఈ కేసును ఏసీబీ కోర్టు విచారించకుండా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న సంగతి విదితమే. ఈ కేసు తాజా స్థితి గురించి వివరాలు అందించాలని కోరుతూ ఏసీబీ కోర్టు లక్ష్మీపార్వతిని కోరింది. అనేక కేసులపై విధిస్తున్న స్టేను ఆరు నెలలకు మించి పొడిగించరాదని హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఈ కేసును విచారించనుంది. ఏసీబీ కోర్టు ఆదేశాలతో శుక్రవారం లక్ష్మీపార్వతి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసును విచారించాలని కోరుకుంటున్నారా లేక ఉపసంహరించుకోవాలనుకుంటున్నారా అని కోర్టు లక్ష్మీపార్వతిని ప్రశ్నించింది. కాగా తాను చేసిన ఫిర్యాదుపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, కేసును విచారించాలని లక్ష్మీపార్వతి తరఫున న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. కోర్టు స్టే విషయాన్ని ఒకసారి సమీక్షించేందుకు తమకు కొంత గడువు కావాలని ఆయన కోర్టుకు చెప్పారు. దీని వల్ల తగిన సమాచారాన్ని కోర్టు ముందుకు వచ్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. అనంతరం కోర్టు ఈ కేసును మే 13వ తేదీకి వాయిదా వేసింది.
కోర్టులో ఈ కేసు వాయిదా పడిన తర్వాత లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ, ఏపిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తాను దాఖలు చేసిన కేసును త్వరితగతిన విచారించాలని కోర్టును కోరినట్లు చెప్పారు. తన ఆస్తులకు సంబంధించి చంద్రబాబు స్వయంగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలను ప్రాతిపదికగా తీసుకుని తాను 2005లో కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసినట్లు చెప్పారు.