క్రైమ్/లీగల్

వరకట్నం వేధింపులకు మహిళ బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదినేపల్లి, : వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముదినేపల్లి మండలం శింగరాయపాలెంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కానుబోయిన సాయి గణేష్‌కు, కలిదిండి మండలం మూలలంక గ్రామానికి చెందిన విజయ భారతి(21)తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.1.5 లక్షల నగదు, అర ఎకరం పొలాన్ని కట్నంగా ఇచ్చారు. పొలం అమ్ముకుని రమ్మని భర్త భార్యను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం భర్త వేధింపులు తాళలేక విజయ భారతి పుట్టినిల్లైన మూలలంకకు వెళ్లింది. పెద్ద మనుషులు సర్ది చెప్పటంతో వారం రోజులు క్రితం అత్తవారిల్లైన శింగరాయపాలెం వచ్చింది. అయినా భర్త వేధింపులు మానకపోవడంతో గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. మృతురాలి బంధువులు మాత్రం ఆత్మహత్య కాదు హత్యే అని అంటున్నారు. వాస్తవాలు పోలీసు దర్యాప్తులో తేలనుంది. మృతురాలికి ఆరు నెలల పసిపాప ఉంది. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్న తీరు చూపరుల హృదయాలను కలచివేసింది. గుడివాడ రూరల్ సీఐ జి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎస్‌ఐ జి రామకృష్ణ, తహశీల్దార్ జి జాన్‌రాజు శవపంచనామ నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రహదారి పక్కన చెత్త దగ్ధం
వాయుకాలుష్కంతో అల్లాడుతున్న ప్రయాణికులు, స్థానికులు
శానిటరీ ఇన్స్‌పెక్టర్ల పనితీరుపై విమర్శలు * చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
విజయవాడ పశ్చిమ, మే 3: నగరంలోని శానిటరీ ఇన్స్‌పెక్టర్ల పనితీరు ప లు విమర్శలకు తావిస్తోంది. నగరంలో చెత్తా చెదారం వాహనాల ద్వారా డం పింగ్ యార్డుకు తరలించాల్సిన అధికారులు నగరంలోని పాలఫ్యాక్టరీ సమీపంలోని రోడ్ పక్కన డంపింగ్ చేసి ని ప్పంటించి తగులబెడుతున్నారు. దీం తో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దట్టమైన పొగ వ్యాపించటం వలన వాహన చోదకుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నా యి. వ్యర్థాలను తగలబెట్టడం వల్ల వ చ్చే కాలుష్య విషవాయువులు స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పట్టపగలే ఇటువంటి దుశ్చర్చలకు పాల్పడుతున్న శానిటరీ సిబ్బంది చర్యలను ఉన్నతాధికారులు నివారించాల్సి ఉం ది. ఐతే గతంలో సీవీఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి పాలఫ్యాక్టరీ వైపు, రైల్వే పోలీస్‌స్టేషన్ వైపున్న మార్గాన్ని చెత్తాచెదారంతో పూడ్చివేసిన సందర్భాలు ఉన్నా యి. అనంతరకాలంలో అత్యవసర మార్గాల అనే్వషణలో భాగంగా అక్క డ రోడ్డు ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తించి అక్కడున్న చెత్తాచెదారా న్ని పొక్లెయిన్‌తో పక్కకు నెట్టడం వల న గతంలో అక్కడ పూడుకుపోయిన రోడ్డు నేడు బహిర్గతమైంది. అలాంటి రోడ్డుకు ఇరువైపులా పెద్దపెద్ద గుట్టల్లా ఉన్నటువంటి చెత్తాచెదారం, అలాగే నగరంలో పురాతన భవనాల కూల్చివేత వలన వచ్చిన శిథిలాలను సైతం రోడ్డు పక్కనే డంపింగ్ చేస్తున్నారు. ఈ చర్యల వలన ఇప్పటికిప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా వాటితో పా టు నగరంలో వాడిపారేసిన చెత్తాచెదా రం, ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ రోడ్లకు ఇరువైపులా డంపింగ్ చేస్తున్నారు. ఈ గుట్టలకు శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, సిబ్బంది ని ప్పు అంటించి తగలబెట్టడం వలన ప రిస్థితి ఆందోళనకరంగా తయారైంది. ఈ విషయంలో మున్సిపల్ ఉన్నతాధికారులు స్థానిక శానిటరీ ఇన్స్‌పెక్టర్లపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ అర్ధరాత్రి సమయంలోనో గుర్తుతెలియని దుండగులు ని ప్పు పెట్టారంటే అనుకోవచ్చు. కానీ ప్ర జారోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులే ఇలా పట్టపగలు రోడ్లపై వాహనాలు తిరుగాడుతుండగా, వందలాది కు టుంబాల నివాసితుల ఆరోగ్యాన్ని ల క్ష్యపెట్టకుండా స్థానిక శానిటరీ ఇన్‌సెక్టర్ ఇలాంటి చర్యలు తీసుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ ళ్లీ ఈసంఘటనలు పునరావృతం కా కుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.