క్రైమ్/లీగల్

ఎన్నికల ప్రచారంలో ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, మే 4: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగానే ఇరువర్గాల మద్య ఘర్షణ చోటు చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం నందిగామ మండలం మామిడిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ నేతలు, ఇండిపెండెంట్ నేతలు ప్రచారం నిర్వహించేందుకు గ్రామానికి ఒకేసారి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అధికార పార్టీ నేతలు, ఇండిపెండెంట్ నేతల మద్య తోపులాట చోటు చేసుకోవడమే కాకుండా ఘర్షణకు దిగారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు, జడ్పీవైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో టీఆర్‌ఎస్ నేతలు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్న విషయం తెలుసుకున్న నందిగామ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో గ్రూపులుగా ఉన్న వ్యక్తులను చెదరగొట్టి 144సెక్షన్‌ను అమలులోకి తీసుకువచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు మామిడిపల్లిలో పెట్రోలింగ్ నిరంతరంగా నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు నందిగామ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వివరించారు.