క్రైమ్/లీగల్

తీర్థయాత్రలకు వెళ్లి వచ్చే సరికి ఇల్లు గుల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, మే 4: ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్లి వచ్చే సరికి ఇళ్లు గుల్లైన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం హైదర్‌నగర్‌లోని హనుమాన్ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న రామరాజు, రమ దంపతులు ఈ నెల 1న తీర్థయాత్రలకని ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్ళారు. శుక్రవారం ఇంటి పక్కన వారు రామరాజు ఇంటి ప్రధాన ద్వారం తాళం తీసి ఉండడాన్ని గమనించి రామరాజుకు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రామరాజు కుటుంబ సభ్యులు శనివారం ఉదయం ఇంటికి చేరుకుని ఇంట్లోని బీరువాను పరిశీలించారు. ఇంట్లో ఉన్న పది తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిపారు.