క్రైమ్/లీగల్

సీరియల్ కిల్లర్ కేసు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 4: రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన సీరియల్ సైకోకిల్లర్ మర్రి శ్రీనివాసరెడ్డిపై పోలీసుల ఉచ్చు బిగుస్తోంది. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి రాచకొండ కమిషనరేట్ నాలుగు పోలీసుల బృందాలను ఏర్పాటు చేసింది. భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి వృత్తిరీత్యా ఏసీ మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. అమ్మాయిలతో చనువుగా ఉన్నప్పటికీ తనను ఎవరూ ప్రేమించడంలేదన్న కోపంతో వారిపై పగపెంచుకున్నాడు. కనిపించిన అమ్మాయిలపై అత్యాచారాలు చేయడం ఆపై హత్యలు చేయడం శవాలను గుట్టుచప్పుడు కాకుండా వ్యవసాయ బావుల్లో పాతిపెట్డడం వంటి చర్యలకు పాల్పడేవాడు. హాజీపూర్ గ్రామంలో అమ్మాయిల అదృశంపై ప్రజలు ఆందోళనకు గురయ్యారు. శ్రావణి, మనీషా ఏప్రిల్ 25వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపుచర్యలు చేపట్టిన పోలీసులకు ఓ వ్యవసాయ బావిలో మృతదేహాలు కనిపించాయి. కట్టుదిట్టమైన నిఘా ఉంచగా శ్రీనివాస్‌రెడ్డిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అతడిని విచారించగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. తానే అత్యాచారాలు, హత్యలకు పాల్పడ్డానని శ్రీనివాసరెడ్డి వాగ్మూలం ఇచ్చాడు. అతడి సన్నిహితులు, బంధువులు ఉన్న ప్రాంతలకు పోలీస్ బృందాలు వెళ్లాయి. అతడి సెల్‌ఫోన్ డేటాలో ఉన్న పేర్లను పరిశీలిస్తున్నారు. ఫోన్ డేటాలో దాదాపు 60 మంది మహిళల పేర్లున్నాయి. వేములవాడకు చెందిన అనీషా అనే మహిళ శ్రీనివాసరెడ్డి ప్రియురాలుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె ఆచూకీ తెలియడం లేదని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క వరంగల్‌లో సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీనివాసరెడ్డిని తమకు అప్పగించాలని రాచకొండ పోలీసులు నల్లగొండ కోర్టులో ఇప్పటికే పిటిషన్ వేశారు. నిజామాబాద్, బాసర, వేములవాడకు పోలీస్ బృందాలు వెళ్లాయి. శ్రీనివాసరెడ్డి ఫోన్ డేటా ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల సమాచారన్ని పోలీసులు రహస్యంగా ఉంచుతున్నారు. అతడి బాధితులు ఏవరైనా ఉంటే తమకు స్వయంగా ఫిర్యాదు చేయవచ్చునని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. కాగా మరో 15 రోజుల్లో కేసు ఓ కొలిక్కి వస్తుందని ఆయన వెల్లడించారు. విద్యార్థినులు కొత్త వ్యక్తులతో ఎలాంటి పరిచయాలూ పెట్టుకోవద్దని ఆయన సూచించారు. కిల్లర్ బెయిల్‌పై బయటకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి కేసు పూర్వాపరాలను కోర్టుకు సమర్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు మహేష్ భగవత్ తెలిపారు. హాజీపూర్‌లో బాలికలపై అఘాయిత్యం చేసిన శ్రీనివాసరెడ్డితో పాటు మరికొంత మంది ఉన్నారని, వారిని కూడా అరెస్టు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ళ శారద డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.