క్రైమ్/లీగల్

అనుమానంతో పెనుభూతమై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, మే 4: బాధ్యతలు తీరాయి, కొడుకు, కుమార్తె వివాహాలు జరిగాయి. అయినా అనుమానంతో ఆలిని కడతేర్చి తానూ తనువు చాలించిన విషాద సంఘటన కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో వైఎస్‌ఆర్ కాలనీలో శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం జక్కంపూడి కాలనీలోని ఎస్‌ఎఫ్ 5, బ్లాక్ 230 రెండో అంతస్తులో చోటుచేసుకున్న ఉదంతమిది. అవనిగడ్డ నరసింహారావు (54), కృష్ణకుమారి (40)లకు సుమారు 25ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి జస్వంత్, రాధ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే అనుమానం పెనుభూతమై ఆలిని హతమార్చిన నరసింహారావు తాను అదే ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగుచూసింది. ఈ సంఘటన స్థలాన్ని సందర్శించిన వెస్ట్‌జోన్ ఏసీపీ కే సుధాకర్, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అయితే కొత్తపేట సీఐ ఉమర్ కేసు పూర్వాపరాలను రాబట్టగలిగారు. నరసింహారావు వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అతని కొడుకు జస్వంత్ కూడా సితార సెంటర్‌లో వెల్డింగ్ పనులు చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. జస్వంత్ వివాహం చేసుకుని తన భార్యతో అదే ప్రాంతంలోని మరో ఇంట్లో వేరేగా ఉంటున్నాడు. కుమార్తె రాధకు వివాహమైనా భర్తతో వచ్చిన విభేదాల వల్ల పుట్టింట్లోనే ఉంటోంది. అయితే శుక్రవారం దంపతులిద్దరూ పొరుగూరు వెళ్లి రాత్రికి వచ్చారు. తల్లిదండ్రులు ఇంట్లో లేనందున వారి కుమార్తె రాధ పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. ఊరు నుంచి వచ్చిన దంపతులిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే గతంలో భార్య నడవడికపై అనుమానంతో ఉన్న నరసింహారావులో చోటుచేసుకున్న ద్వేషం పరాకాష్టకు చేరింది. దాంతో పథకం ప్రకారం సిద్ధం చేసుకున్న గొడ్డలితో భార్యపై దాడి చేసి విచక్షణారహితంగా నరికాడు. తీవ్ర గాయాలపాలైన కృష్ణకుమారి రక్తస్రావంతో ఆశువులు బాసింది. అయితే తాను నమ్మిన సొంత ఇల్లాలే తనను మోసం చేసిందన్న మనోవేదనతో తాను కూడా తనువు చాలించాలని నిర్ణయానికి వచ్చాడు. అదే ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు ముందు వారి కుమారుడు జస్వంత్ శుక్రవారం రాత్రి తల్లిదండ్రులు ఇద్దరికీ అల్పాహారం ఇచ్చి వెళ్లాడు. మరునాడు శనివారం ఇంటికి వచ్చి చూడగా తలుపులు గడియపెట్టి ఉన్నాయి. ఎంతసేపటికీ తలుపుతట్టినా లోపల నుంచి సమాధానం రాకపోవటంతో అనుమానం వచ్చిన జస్వంత్ తలుపులు బలవంతంగా పగలగొట్టి లోపలకు వెళ్లగా నెత్తుటి మడుగులో తల్లి మృతి చెంది ఉండటం, తండ్రి విగతజీవిగా ఉరికి వేలాడుతూ ఉండటాన్ని గమనించి వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచాడు. అదే విధంగా 100కు సమాచారం అందించగా కొత్తపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి సీఐ ఉమర్, ఎస్‌ఐ కృష్ణలు, సిబ్బంది చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మృతుని కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే గతంలో పలుమార్లు తమ తల్లిపై అనుమానంతో తండ్రి పరుష పదజాలంతో దూషించిన సంఘటనలు ఉన్నాయని, అనుమానంతో వేధించేవాడని మృతుడి కుమారుడు జస్వంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.