క్రైమ్/లీగల్

నలుగురిని మింగిన చెరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, మే 4: వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు ఈతకు వెళ్ళిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఓ ఊర చెరువు మింగేసింది. అప్పటి దాకా ఇంటి వద్ద కలివిడిగా తిరిగిన ఆ నలుగురు కొద్ది సమయంలోనే మృత్యువు ఒడిలోకి వెళ్ళారన్న వార్త తెలియగానే ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. ఊరు ఊరంతా చెరువు వద్దకు పరుగులు తీశారు. ఈ విషాదకరమైన ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన సాతరి రాజయ్య (75), గోదావరిఖనికి చెందిన తనయుడు మల్లేష్ కొడుకులు సాతరి ఆదర్శ్ (17), సాతరి సిద్దార్థ (14), చిట్ల లిట్టు (10) అనే నలుగురు ఊర చెరువులో పడి మృతి చెందగా, ఇందులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయ. మరో ఇద్దరి మృతదేహాల కోసం గ్రామస్థులు గాలిస్తున్నారు. వేసవి నుంచి ఉపశమనంతో పాటు పిల్లలకు ఈత నేర్పుతానని తీసుకెళ్లగా ఊర చెరువులోని ఊబిలో మొదట ఒక్కరు చిక్కుకుపోగా వారిని కాపాడేందుకు మరొకరు చెరువులోకి దిగారు. దీంతో ఇద్దరూ ఊబిలోనే చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు చెరువులోకి దిగిన మరో ఇద్దరు అందులోనే చిక్కుకొని ఊపిరాడక మృతి చెందారు. కాగా ఈ ఊర చెరువులో ఈతకెళ్లిన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా, శనివారం రాత్రి వరకు కూడా మరో ఇద్దరి మృతదేహాల కోసం గ్రామస్థులు గాలిస్తున్నారు. వేసవి సెలవుల కు తాతా ఇంటికి వచ్చిన చిన్నారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
చిత్రం... చెరువులో లభ్యమైన ఇద్దరి మృతదేహాలు