క్రైమ్/లీగల్

చిత్తూరులో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 6 : చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్‌కాలనీలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఇంట్లోని లాకర్ తాళాలు పగులకొట్టి అందులోని రూ 19.20 లక్షల విలువజేసే 80 సవర్ల (640గ్రాములు) బంగారు ఆభరణాలతో పాటు, రూ 1.50 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. స్థానిక క్రైమ్ స్టేషన్ సీఐ శ్రీనివాసరావు కథనం మేరకు...స్థానిక రాములగుడి వీధిలో జమున కాఫీ పొడి విక్రయ దుకాణాన్ని నిర్వహిస్తున్న యోగీశ్వరన్ లక్ష్మీనగర్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. గత నాలుగు రోజు క్రితం ఆయన తల్లి, భార్య, పిల్లలు తీర్థ యాత్రలకు వెళ్లారు. యోగీశ్వరన్ ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు తన ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లి తిరిగి రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా యధావిథిగా తన షాపును మూసుకుని రాత్రి ఇంటికి వచ్చి తాళాలు వేసుకుని డాబాపై పడుకుని నిద్రించాడు. అయితే సోమవారం వేకువజామున 4 గంటలకు దాహం వేయడంతో యోగీశ్వరన్ డాబాపై నుంచి దిగి కిందకు వచ్చి చూడగా బెడ్ రూము తలుపులు తెరిచి ఉండటం, బీరువాలోని దుస్తులు చిందరవందరగా పడి ఉండటం, లాకర్ తలుపులు బద్దలుకొట్టి ఉండటాన్ని చూశాడు. వెంటనే లాకర్ వద్దకు వెళ్లి చూడగా అందులో దాచిన నగదుతో పాటు, తన తాతల కాలం బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఉదయం తన నివాసానికి సమీపంలోనే ఉన్న ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో చోరీ విషయంగా ఫిర్యాదు చేశాడు. దీంతోట్రాఫిక్ సీఐతో పాటు, ట్రాఫిక్ ఏఎస్సై ఖాధర్ సంఘటా స్థలానికి చేరుకుని వేలిముద్రల నిపుణుల సాయంతో ఆధారాలను సేకరించారు. .