క్రైమ్/లీగల్

సింహపురి యాజమాన్యంపై అట్రాసిటీ కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, మే 7: గిరిజనుడైన ఏకుల శ్రీనివాసులకు బ్రెయిన్‌డెడ్ అని ప్రకటించి అతని అవయవాలు బలవంతంగా దానం చేయించిన సంఘటనలో నెల్లూరు పట్టణంలోని సింహపురి వైద్యశాలపై నమోదైన కేసు మరో మలుపు తిరిగింది. ఈ ఘటనలో సింహపురి హాస్పటల్ యాజమాన్యంపై అట్రాసిటీ కేసును రూరల్ పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే ఓ కేసు యాజమాన్యంపై నమోదై ఉంది. గిరిజన సంఘాల ఆందోళనతో అట్రసిటీ కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా శ్రీనివాసులకు ఆపరేషన్ చేసి అవయవాలు తొలగించిన ఐదుగురు డాక్టర్లపై చర్యలకు రంగం సిద్ధమైంది. వారిపై కూడా కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద సింహపురి హాస్పటల్ ఘోర చర్యపై జిల్లా మొత్తం ప్రకంపనలు సృష్టిస్తోంది.