క్రైమ్/లీగల్

ఎస్సీ సర్ట్ఫికెట్‌కు తప్పుడు పత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, మే 8: చెత్తకుప్పలో దొరికన దరఖాస్తులు.. తిరస్కరణకు గురైనవని సరూర్‌నగర్ తహశీల్దార్ ఎన్.శ్రీనివాస్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. ఉన్నత విద్య, చదువులు, ఉద్యోగాల కోసం చేసుకునే కుల, నివాస, పుట్టిన ధ్రువీకరణ సర్ట్ఫికెట్ల కోసం మీ-సేవలో చేసుకున్న దరఖాస్తులు సరూర్‌నగర్ తహశీల్దార్ మండల కార్యాలయం ఆవరణలోని చెత్తకుప్పలో పడి ఉన్నాయని ఆరోపిస్తున్న ఓ మహిళ ఆరోపణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా.. చెత్తకుప్పలో కుల, నివాస, పుట్టిన ధ్రువీకరణ దరఖాస్తు ఫారాలు నిజమైనవి కావని అన్నారు. సిరీన్ క్రిష్ట్ఫోర్ అనే మహిళ ఎస్సీ సర్ట్ఫికెట్ కోసం మీ-సేవ ద్వారా 26 మార్చి 2019న దరఖాస్తు చేశారని, తప్పుడు పత్రాలు సమర్పించడంతో, కుల ధ్రువీకరణ సర్ట్ఫికెట్‌ను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించడమే కాకుండా, దరఖాస్తు ఫారాలు చెత్తకుప్పలో ఉన్నాయని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన సిరీన్ క్రిష్ట్ఫోర్‌పై, తప్పుడు కుల సంఘం పత్రం ఇచ్చిన వ్యక్తితో పాటు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తిపై సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.