క్రైమ్/లీగల్

ఆ రెండింటికీ నోటిఫికేషన్ ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన భూపతిరెడ్డి, యాదవరెడ్డిలపై అనర్హత వేటుతో ఏర్పడిన ఎమ్మెల్సీ స్థానాలకు ఏర్పడిన ఖాళీల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇవ్వొద్దని రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దుకు సంబంధించిన రికార్డులను తమకు సమర్పించాలని శాసనమండలిని హైకోర్టు ఆదేశించింది. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎన్నికైన భూపతిరెడ్డి, శాసనసభ్యుల కోటాలో గెలిచిన యాదవరెడ్డిపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు భూపతిరెడ్డి, యాదవరెడ్డితో పాటు రాములు నాయక్‌పై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ శాసనమండలి పక్షం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండలి చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సభ్యత్వం రద్దును సవాల్ చేస్తూ భూపతిరెడ్డి, యాదవరెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు గురువారం నాడు మారో మారు విచారించింది. తమ వాదన వినకుండానే సహజ న్యాయసూత్రానికి విరుద్ధంగా మండలి నిర్ణయం తీసుకుందని వారు తమ వాదన వినిపించారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరామనేందుకు ఎలాంటి ఆధారం లేదని అయినా శాసనమండలి ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా తమపై అనర్హత వేటు వేసిందని వారు ఆరోపించారు. దీంతో ఈ ఇద్దరి ఎమ్మెల్సీల స్థానాలకు ఈ నెల 15 వరకూ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వొద్దని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అనర్హతకు ఎమ్మెల్సీలు భూపతి రెడ్డి, యాదవరెడ్డి పిటీషన్లపై న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. యాదవరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది డీ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 14న ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరినట్టు టీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేశారని అన్నారు. అయితే ఆ రోజు తాను ఢిల్లీ వెళ్లలేదని పిటీషనర్ వివరించారు. 23న మేడ్చెల్‌లో సోనియాగాంధీ ర్యాలీలో పిటీషనర్ పాల్గొన్నట్టు పేర్కొన్నారని, అయితే పిటీషనర్ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయినందున, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వెళ్లారని, దీనిని మీడియా తప్పుగా అర్ధం చేసుకుని వార్తలను ప్రచురించిందని, వాటిని ఆధారంగా తీసుకుని నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు.