క్రైమ్/లీగల్

ఫంక్షన్‌హాల్ లిఫ్ట్‌లో పడి మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మే 9: లిఫ్ట్ ఎక్కబోయి కాలు జారి కింద పడి మహిళ మృతిచెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నగర శివారులోని హైదర్‌గూడలో గల కేకే ఫంక్షన్‌హాల్‌ను కుమ్మరి కృష్ణ నిర్వహిస్తున్నాడు. ఫంక్షన్‌హాల్‌లో బుధవారం రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు కమలమ్మ(55) అనే మహిళ హాజరైంది. ఫంక్షన్ అయిపోగానే కిందకు దిగేందుకు లిఫ్ట్ వద్దకు కమలమ్మ వెళ్లింది. లిఫ్ట్ రాలేదు, డోర్ ఓపెన్ అయ్యింది. దీంతో హడావిడిలో లిఫ్ట్ ఎక్కేందుకు వెళ్లి అందులో కాలు జారి కమలమ్మ కింద పడిపోయింది. అక్కడికక్కడే కమలమ్మ మృతి చెందింది. స్థానికులు గమనించి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కమలమ్మ లిఫ్ట్‌లో నుంచి కింద పడడంతో ఆమె బంధువులు, కుటుంబీకులు ఆందోళనకు దిగారు. కేసును నీరుగార్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకొని తగిన న్యాయం చేయాలని మృతురాలు కమలమ్మ కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.