క్రైమ్/లీగల్

త్వరితగతిన పెండింగ్ కేసుల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 10: నేర పరిశోధక విభాగం(సీఐడీ)లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. విశాఖ ఆరిలోవ పైనాపిల్ కాలనీలో నేర పరిశోధక విభాగం(సీఐడీ) ప్రాంతీయ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేర పరిశోధక విభాగంలో అత్యధికంగా పెండింగ్ కేసులు ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో సీఐడీ విభాగంలో 707 పెండింగ్ కేసులు ఉన్నాయని, వీటిలో 77 కేసులు కోర్టు పరిధిలో ఉండగా, మరో 130 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. విశాఖలో రూ.2.39 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి నిర్మించిన మోడర్న్ కార్యాలయం ద్వారా మరింత వైద్యసేవలు అందే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం విశాఖలోని చిట్‌ఫంట్ కంపెనీల మోసాలు, తుని రైలు దహనం ఘటనకు సంబంధించిన కేసులు సీఐడీ పర్యవేక్షిస్తుందన్నారు. ప్రజలను సైబర్, ఇతర నేరాల పట్ల అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సిబ్బంది సహకారంతో తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న కిడ్నీ రాకెట్ ఘటనపై కలెక్టర్ అధ్యక్షతన త్రిసభ్య కమిటీని నియమించామని, ఈ కమిటీలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి, కేజీహెచ్ సూపరిండింటెంట్, కలెక్టర్ ఉంటారన్నారు. ఈ కమిటీ అందించిన నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను ఆరెస్టు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ కలెక్టర్ కె.్భస్కర్, పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా, సీఐడీ డీజీ అమిత్‌గార్గ్, మెట్రోపాలిటిన్ కమిషనర్ బసంత్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.