క్రైమ్/లీగల్

రాఫెల్‌పై ముగిసిన వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై వచ్చిన రివ్యూ పిటిషన్లను దేశ సర్వోన్నత న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. కేంద్ర ప్రభుత్వం తరఫున, పిటిషనర్ల తరఫున శుక్రవారం సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టులో తమ తమ వాదనలను వినిపించారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన గల డివిజన్ బెంచ్ ఆయా పక్షాల వాదనలు పూర్తిగా విన్న తర్వాత రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై తీర్పును రిజర్వులో ఉంచింది. ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్ధ విమానాలపై కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గత ఏడాది డిసెంబర్ 14న పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారాన్ని రద్దు చేయాలని వారు తమతమ అభ్యర్థనల ద్వారా కోర్టుకు విన్నవించారు. అయితే, శుక్రవారం దాదాపు రెండు గంటల పాటు సాగిన వాదనల్లో పాల్గొన్న సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో జరిగిన అవకతవకలు, దీనిపై ఎఫ్‌ఐఆర్ దాఖలైన విషయంతోపాటు క్రిమినల్ కేసు నమోదై దర్యాప్తు వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అదేవిధంగా యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలతోపాటు ముగ్గురు సభ్యులు గల మధ్యవర్తిత్వ సభ్యులు చేసిన వ్యవహారాన్ని దీనిని వచ్చిన అభ్యంతరాలను సైతం ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలావుండగా, కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ మాట్లాడుతూ పిటిషనర్లు పదేపదే యుద్ధ విమానాల ధరల అంశంపైనే వాదనలు వినిపిస్తున్నారని, గతంలో వారు వేసిన రిట్ పిటిషన్ల విషయంలోనూ ఇవే వాదనలు వినిపించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేశ ప్రజలందరి రక్షణ కోసమే యుద్ధ విమానాల కొనుగోలు జరిగిందని, ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ ప్రకారం ఫ్రాన్స్-్భరత్ మధ్య కొనుగోలు జరిగిన ధరలను బహిర్గతం చేయరాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రివ్యూ పిటిషన్లను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు. ఇటు పిటిషనర్లు, అటు ప్రభుత్వం తరఫున వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం చివరకు తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్టు స్పష్టం చేసింది.