క్రైమ్/లీగల్

కేసును మూసేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: దేశ సర్వోన్నత న్యాయస్థానం అనని వ్యాఖ్యలను అన్నట్టు ఆపాదించి క్రిమినల్ కేసు ఎదుర్కొన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ బేషరతు క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో తనపై నమోదైన కోర్టు ధిక్కార కేసును మూసివేయాలని కోరారు. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సైతం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పుపై రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రంగా పరిగణించిన బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి రాఫెల్ విమానాల అంశంపై సుప్రీంకోర్టు చేసిన తీర్పు సైతం ‘చౌకీదార్ చోర్ హై’ అన్న చందాన ఉందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలను క్షమార్హం కావని పేర్కొన్న సుప్రీంకోర్టు దీనిని తీవ్రంగా పరిగణించింది. అయితే, రాహుల్ దేశ సర్వోన్నత న్యాయస్థానంపై చేసిన వ్యాఖ్యాలపై రెండు రోజుల కిందట బేషరతుగా క్షమాపణలు కోరారు. రాహుల్ తరఫున సీనియర్ న్యాయవాదులు ఏ.ఎం.సింఘ్వి హాజరై తన వాదనలను వినిపించారు. రాహల్ బేషరతు క్షమాపణలు కోరిన నేపథ్యంలో సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యతన గల డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ కేసును విచారించి తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్టు వెల్లడించింది. ఇదిలావుండగా, బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్‌తగి తన వాదనలో మాత్రం రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బేషరతు క్షమాపణ చెప్పినా చట్టప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానంపై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ప్రజలకు క్షమాపణ చెప్పేలా చూడాలని తన వాదనలను వినిపించారు.