క్రైమ్/లీగల్

ప్రత్యేక బెంచ్‌ని నియమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: ఏఐఏడీఎంకేకు చెందిన రెండాకుల గుర్తు వివాదంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బుధవారం నిలిపివేసింది. రెండాకుల గుర్తు వివాదంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్‌తో కూడిన బెంచ్ పైవిధంగా ఆదేశించింది. ఏఐఏడీఎంకేలోని రెండు వర్గాల మధ్య ఏర్పడిన పార్టీ గుర్తు వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు ద్విసభ్య బెంచ్‌ను ప్రత్యేకంగా నియమించాలని కూడా ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిని ఆదేశించింది. ఏఐఏడీఎంకే తిరుగుబాటు అభ్యర్థి దినకరన్ స్థాపించిన ఏఐఏడీఎంకే (అమ్మ) పార్టీకి ప్రెషర్ కుక్కర్ గుర్తును కేటాయించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 9న ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిన విషయం విదితమే. ఈ ఆదేశాలను నిలిపివేసిన సుప్రీంకోర్టు ఏప్రిల్ నెలాఖరులోగా రెండాకుల గుర్తు ఎవరికి కేటాయించాలో తేల్చాలని గడువు విధించింది.