క్రైమ్/లీగల్

‘కాళేశ్వరం’పై స్టే ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు స్పష్టం చేసింది. మల్లన్న సాగర్ నిర్వాసితుల పిటీషన్లపై హైకోర్టులో గురువారం నాడు విచారణ కొనసాగింది. విచారణ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ ఇంత వరకూ ఎన్ని ఎకరాలను సేకరించారో, ఎన్ని ఎకరాల మేర నిర్వాసితులకు పరిహారం చెల్లించారో చెప్పాలని అధికారులను ప్రశ్నించగా, ఇంత వరకూ 4108 ఎకరాలను రైతుల నుండి సేకరించామని, 4061 ఎకరాల మేర పరిహారం చెల్లించామని, మరో 47 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం పరిహారం చెల్లింపు చెక్కులను హైకోర్టు ముందు దాఖలు చేసింది. కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును కేవలం కొద్ది మంది భూ యజమానుల కోసం ఆపలేమని హైకోర్టు పేర్కొంది. పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే తమ వద్దకు రావచ్చని సూచించింది. పరిహారం తీసుకోవడానికి నిరాకరించిన నిర్వాసితుల పరిహారాన్ని వారి న్యాయవాదులకు అందజేయాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్వాసితులకు పరిహారాన్ని అందజేశారు. దీంతో సహాయ పునరావాస ప్యాకేజీ వంద శాతం పూర్తయిందని అధికారులు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 175 కేసులను హైకోర్టు ఏకకాలంలో విచారించాలన్న ప్రభుత్వ పిటీషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం నాడు అంగీకరించింది. అన్ని పిటీషన్లు కలిపి విచారిస్తామని పేర్కొంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభఉత్వం ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చని చెప్పింది. అనంతరం తదుపరి విచారణను మరో రెండు వారాలు వాయిదా వేసింది.