క్రైమ్/లీగల్

కోచింగ్ సెంటర్‌లో అగ్నికీలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్, మే 24: సూరత్‌లో శుక్రవారం ఓ నాలుగు అంతస్థుల వాణిజ్య భవంతిలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంలో 18 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. వీరంతా కూడా ఈ భవనంలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌లో చదువుకుంటున్నవారే. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో చాలా మంది విద్యార్థులు భవనం నుంచి దూకి మరణించారు. మరి కొందరు ఊపిరాడని పరిస్థితుల్లో మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో అనేక మంది గాయపడినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. సర్తానా ప్రాంతంలోని తక్షశిల కాంప్లెక్స్‌లో జరిగిన ఈ అగ్నిప్రమాదం దృశ్యాలు సామాజిక మీడియాలో వైరల్‌గా మారాయి. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ప్రాణాలు దక్కించుకోవడానికి విద్యార్థులు కిటికీల్లో నుంచి కిందకు దూకారని అధికారులు వెల్లడించారు. మొత్తం ఈ వాణిజ్య కాంప్లెక్స్‌ను మంటలు చుట్టుముట్టాయని ఈ 18 మంది విద్యార్థుల్లో ఊపిరాడక కొందరు, మంటల్లో చిక్కుకుని మరి కొందరు మరణించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనపై విస్తృత స్థాయి దర్యాప్తుకు ఆదేశించామని, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తెలిపారు. నాలుగవ అంతస్తు, మూడవ అంతస్తు నుంచి విద్యార్థులు దూకినట్లుగా స్పష్టమవుతున్నదని అన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని వెల్లడించారు. అలాగే మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక దళాలను రంగంలోకి దింపామని మరో అధికారి తెలిపారు. కమ్ముకున్న మంటలు, పొగల మధ్య విద్యార్థులు మూడు, నాలుగు అంతస్తుల నుంచి దూకుతున్నట్లుగా ఛానల్స్‌లో ప్రసారమైన వీడియోలు సర్వత్రా దిగ్భ్రాంతి కలిగించాయి. మంటల్లో చిక్కుకున్న ఈ భవనంలోని విద్యార్థులతో పాటు ఇతరులను కూడా స్థానికుల సహాయంతో రక్షించగలిగామని తెలిపారు. ఈ నాలుగు అంతస్తుల భవనంలో కోచింగ్ సెంటర్‌తో పాటు అనేక ఇతర కేంద్రాలూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ప్రమాదం గురించి తెలిసిందో హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి వెళ్ళి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా పట్టణాభివృద్ధి విభాగం ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి విజయ్‌రూపాణి ఆదేశించారు. ఈ సంఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
ప్రధాని మోదీ సంతాపం
కాగా, ఈ ఘోర విపత్తు పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల బాధను తానూ పంచుకుంటున్నానని పేర్కొన్న ఆయన గాయపడిన వ్యక్తులు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక అధికారులను ఆదేశించినట్లు మోదీ ట్వీట్ చేశారు.