క్రైమ్/లీగల్

భార్యను హత్య చేసిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 30: కుటుంబ కలహాలతో తరచూ గొడవ పడుతూ భార్యను గొంతు నులిమి భర్త హత్య చేసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దేవరకొండ సమీపంలోని చింతపల్లికి చెందిన జర్పుల శ్రీను, దేవి (25) దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మూసాపేట రాఘవేంద్ర సొసైటీలో నివాసం ఉంటున్నారు. శ్రీను స్థానికంగా డ్రైక్లీనింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. భార్య దేవి ఇంటిపని మాత్రమే చూసుకునేది. వీరికి 1వ తరగతి చదువుతున్న షుభాష్(7)తో పాటు యూకేజీ చదువుతున్న కుమారుడు(5) ఉన్నారు. కొంత కాలంగా భార్యాభర్తలు తరచూ గొడవ పడుతున్నరు. పుట్టింటి నుంచి రావలసిన ఆస్తి విషయంలో భార్యను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు. దేవి తన సొంతూరు చింతపలోని ఓ స్థలాన్ని అమ్మిన విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని, అమ్మిన స్థలం డబ్బులో కొంత మొత్తాన్ని తీసుకురావాలని భార్యను వేధిస్తున్నట్లు తెలిసింది. అంగీకరించక పోవడంతో ఆగ్రహం చెందిన శ్రీను గురువారం రాత్రి పిల్లలు నిద్రిస్తున్న సమయంలోనే దేవితో గొడవపడ్డాడు. దీంతో ఇరువురి మద్యతోపులాట కూడా జరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. కోపోద్రిక్తుడై దేవి గొంతును నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. దేవి శరీరంపై రక్తపు గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనును అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.