క్రైమ్/లీగల్

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిరివెళ్ల/ఓర్వకల్లు, జూన్ 10 : కర్నూలు జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. గుంటూరు జిల్లా రాచేపల్లె మండలం పెద్దగాళ్లపాడు గ్రామానికి చెందిన పది మంది టెంపో వాహనంలో మహానంది పుణ్యక్షేత్రానికి బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో శిరివెళ్ల మండల పరిధిలోని నంద్యాల-గిద్దలూరు రహదారిలో పచ్చర్ల గ్రామం సమీపంలో డ్రైవర్ అజాగ్రత్త వల్ల టెంపో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న బ్రహ్మయ్య(48), గరికెల అంజి(45) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. అలాగే మండల కేంద్రమైన ఓర్వకల్లు సమీపంలో ఓ డాబా వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ తెలుగు మహేష్(22) మృతి చెందాడు. ఇక నంద్యాల మండలంలో జాతీయ రహదారిపై మట్టిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్, ఇన్నోవా కారు ఢీకొన్న సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.