క్రైమ్/లీగల్

ట్రాక్టర్ ఢీకొని కూలీ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, మార్చి 30: బషీరాబాద్ మండలం గొటిగకలాన్ గ్రామశివారులోని వాగులో అర్ధరాత్రి వేళ ఇసుకను తరలించే యత్నంలో ట్రాక్టర్ ఢీకొని మహిళా కూలీ మృతిచెందింది. కేసు వివరాలను బషిరాబాద్ ఎస్సై లక్ష్మయ్య, తాండూరు డీఎస్పీ రామచంద్రుడు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి వాగులోనుంచి ఇసుకను తరలించేందుకు కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. ఇసుక తరలిస్తున్న క్రమంలో ట్రాక్టర్ ఢీకొని గొటిగకలాన్‌కు చెందిన మహిళా కూలీ వెంకటమ్మ(54) మృతిచెందింది. మృతురాలి భర్త సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీఆర్‌ఎస్ నాయకులుగా భావిస్తున్న చెన్నారం విశ్వనాథ్ రెడ్డి, చెన్నారం దామోదర్ రెడ్డి, ట్రాక్టర్ డ్రైవర్, యజమాని ఎండీ రియాజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అభివృద్ధి పనులకే ఇసుక తరలిస్తున్నట్లు డీఎస్పీ రామచంద్రుడు పేర్కొన్నారు. కాగా, అర్థరాత్రి వేళ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ ఎండీ రియాజ్ నిర్లక్ష్యంతోనే వెంకటమ్మ మృతిచెందందని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు లక్షల రూపాయలకు కేసు మాఫీ చేసేందుకు నిందితులు ప్రయత్నించినట్లు తెలిసింది. పోలీసులు ససేమిరా అనడంతో రాజీయత్నాలు విఫలమయినట్లు సమాచారం.