క్రైమ్/లీగల్

పది టన్నుల వెండి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో పది టన్నుల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న కంటైనర్ సోమవారం పోలీసులకు పట్టుబడింది. వాహనంలోని వెండి విలువ సుమారు రూ.40 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనావేస్తున్నా రు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వెండి తరలింపుపై పోలీసులకు అనుమా నం రావడంతో వాహనాలు తని ఖీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కంటైనర్‌ను తనిఖీ చేయగా దానిలో ఎనిమిది వేలకు పైగా వెండి కడ్డీలను పోలీసులు గుర్తించారు. వెండికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు, ఆధారాలు లేకపోవడంతో వాహనం డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి వద్ద నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు డ్రైవర్లను విచారిస్తున్నారు. వెండి కడ్డీల విలువపై పోలీసులు నిపుణులతో చర్చిస్తున్నారు. లండన్ నుంచి వచ్చిన ఈ వెండిని చెన్నై నుంచి కంటైనర్‌లో హైదరాబాద్‌లోని వివిధ దుకాణాలకు విక్రయించేందుకు తరలిస్తుండగా బోయిన్‌పల్లి పోలీస్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ తన బృందంతో దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడిన వెండికి సంబంధించి బిల్లులు ఉన్నాయా? లేక అక్రమంగా తరలిస్తున్నారా? అనే కోణంలో బోయిన్‌పల్లి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.