క్రైమ్/లీగల్

ఆభరణాలతో ఉడాయించిన ఆటో డ్రైవర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, జూన్ 10: బంగారు ఆభరణలతో ఉడాయించిన ఆటో డ్రైవర్‌ను పట్టుకుని, అతని నుంచి ఏడు తులాల ఆభరణాలను రికవరీ చేసినట్లు వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ పేర్కొన్నారు. సోమవారం మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఎన్.యాదయ్యతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో ఏసీపీ గాంధీనారాయణ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన జెటవాత్ రఘు రెండు సంవత్సరాల క్రితం అల్మాస్‌గూడ వైఎస్‌ఆర్ కాలనీలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటూ ఆటో నడుపుకుంటున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతను ఏదైనా దొంగతనం చేసి డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఈనెల 8న రఘు ఎల్బీనగర్ చౌరస్తాలో టీఎస్ 13 యూఏ 1696 నెంబర్ గల ఆటోను స్టాండ్‌లో పెట్టుకొని ఉన్నాడు. అంతలో శ్రీలక్ష్మి అనే మహిళ అతని దగ్గరకు వచ్చి ఆటో మాట్లాడుకొని టీకేఆర్ కమాన్ దగ్గర దిగే సమయంలో తన నగల బ్యాగును మరిచి దిగిపోయింది. అది గమనించిన రఘు వెంటనే ఇంటికి వెళ్లి నగల బ్యాగును తెరచి చూడగా అందులో దాదాపు రూ.2 లక్షల 10 వేల విలువైన ఏడు తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆటో డ్రైవర్ ఆ నగల బ్యాగును బీరువాలో దాచి ఉంచాడు. బాధితురాలు శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు ఆటోను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకొని, నగలను రికవరీ చేయడంతో పాటు అరెస్టు చేశారు.