క్రైమ్/లీగల్

రవిప్రకాశ్ పిటిషన్ విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ముందస్తు బెయిల్‌కు సంబంధించిన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం నాడు సుదీర్ఘవాదనలు జరిగాయి. రవిప్రకాశ్‌ను కావాలనే పలు కేసుల్లో ఇరికించారని ఆయన తరఫున న్యాయవాది పేర్కొనగా, రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడ్డారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసుల తరఫున న్యాయవాది చెప్పారు. పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హారెన్ రావెల్ హాజరుకాగా, రవిప్రకాశ్ తరఫున దిల్‌జిత్ సింగ్ అహ్లువాలియా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి ముందు తమ వాదనలను వినిపించారు. రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడ్డారని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఫోర్జరీ పత్రాలను కోర్టుకు సమర్పించారు. అదే విధంగా 160 సీఆర్‌పీసీ, 41ఏ నోటీసులు ఇచ్చినా విచారణకు రవిప్రకాశ్ సహకరించలేదంటూ పత్రాలను కోర్టుకు అందజేశారు. అదే విధంగా మొబైల్‌లో రవిప్రకాశ్ జరిపిన సంభాషణల స్క్రీన్ షాట్‌లను కూడా కోర్టుకు అందజేశారు.
విచారణకు హాజరుకాకుండా హైదరాబాద్, బెంగళూరులో తిరుగుతూ పోలీసులను రవిప్రకాశ్ ముప్పుతిప్పలు పెట్టారని వివరించారు. 90 నుండి వంద కోట్ల రూపాయిలు విలువ చేసే టీవీ 9 లోగోను కేవలం 99 వేల రూపాయిలకే రవిప్రకాశ్ అమ్మేశారని అలా ఎలా అమ్ముతారని ప్రశ్నిస్తే తాను కంపెనీకి యజమానిని అని చెబుతున్నారని పేర్కొన్నారు. 9 శాతం వాటా ఉన్న వాళ్లు కంపెనీకి యజమాని ఎలా అవుతారని పోలీసులు తమ వాదన వినిపించారు. అలాంటపుడు 90 శాతం వాటా ఉన్న వారి సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఈ కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని అన్నారు. ఏబీసీఎల్‌లో రవిప్రకాశ్ తన వాటా 40వేల షేర్లను శివాజీకి విక్రయించినట్టు తప్పుడు పత్రాలను సృష్టించారని పోలీసులు పేర్కొన్నారు. 2018 ఫిబ్రవరిలో వాటాలను విక్రయించినట్టు రవిప్రకాశ్ చెబుతున్నారని, అదే వాస్తవమైతే వాటిని రికార్డుల్లో చూపాల్సి ఉందని అన్నారు. ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన రిటర్న్‌లలో ఈ సొమ్ము గురించి రవిప్రకాశ్, శివాజీ ఇద్దరూ చూపలేదని అన్నారు. కేవలం ఫోర్జరీ ద్వారా తప్పుడు పత్రాలు సృష్టించి వాటాల విక్రయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారని అన్నారు. టీవీ 9 లోగో అమ్మకానికి వాటాదారుల అనుమతి లేదని అన్నారు. మీడియా నెక్స్ట్‌కు అక్రమంగా నిధులను మళ్లించారని తప్పు చేయనప్పుడు పోలీసు ముందుకు విచారణకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతోనే రవిప్రకాశ్ పోలీసుల ముందుకు వచ్చారని అన్నారు. విచారణ నిమిత్తం శివాజీకీ నోటీసులు ఇచ్చామని, ఆయన ఇంత వరకూ స్పందించలేదని అన్నారు. ఇలాంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేయరాదని పోలీసులు వాదించారు.
రవిప్రకాశ్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశందని ఆయనను ఎట్టిపరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయవద్దని హైకోర్టు న్యాయమూర్తిని పోలీసుల తరఫున న్యాయవాది కోరారు. దీనికి కౌంటర్‌గా రవిప్రకాశ్ తరఫున దిల్‌జిత్ సింగ్ అహ్లువాలియా వాదించారు. రవిప్రకాశ్ ఫోన్ సంభాషణలకు సంబంధించిన స్క్రీన్ షాట్‌లను కోర్టుకు సమర్పించడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తన క్లయింట్ మొబైల్ ఫోన్‌లో ఉన్న డేటాను స్క్రీన్ షాట్ ఎలా తీస్తారని ఆయన ప్రశ్నించారు. కావాలనే లోగో వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారని , టీవీ 9 లోగో సృష్టికర్త రవిప్రకాశ్ అని , కాపీరైట్ చట్టం సెక్షన్ 70 ప్రకారం లోగోపై ఆయనకు పూర్తి హక్కు ఉందని వాదించారు. 2003 నుండి టీవీ 9 ఫౌండర్‌గా రవిప్రకాశ్ వ్యవహరిస్తూ వచ్చారని, సివిల్ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకపోవడం మంచిదని అన్నారు. రవిప్రకాశ్‌కు బెయిల్ ఇస్తే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేవని, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని దిల్‌జిత్‌సింగ్ అహ్లువాలియా కోరారు. కాగా సమయం మించిపోవడంతో తదుపరి విచారణను వచ్చే 18వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.
అంతకు ముందు జరిగిన విచారణలో రవిప్రకాశ్ తరఫున న్యాయవాది అహ్లువాలియా తమ వాదనలు వినిపిస్తూ టీవీ 9 ఏర్పాటు సమయంలో మారిషస్ నుండి ఫెమా నిబంధనలకు విరుద్ధంగా 60 కోట్ల రూపాయిలు నిధులు వచ్చాయని, ప్రస్తుతం టీవీ 9లో వాటాలను విక్రయించిన సందర్భంగా హవాలా మార్గంలోనే నిధులను తరలించారని ఆరోపించారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులు నిధులను తరలించే మార్గంలోనే ఈ నిధులను కూడా తరలించారంటూ ఆయన ఆరోపించారు. వీటన్నింటిపైనా దర్యాప్తు చేయాలని సీబీఐ, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్‌లకు తాను ఇటీవల ఫిర్యాదు చేశానని , అప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వం తనను వెంటాడుతోందని రవిప్రకాశ్ పేర్కొన్నారని న్యాయవాది చెప్పారు.
క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన శివాజీ
పోలీసులు తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ సినీ నటుడు శివాజీ హైకోర్టులో క్వాష్ పిటీషన్‌ను దాఖలు చేశారు.