క్రైమ్/లీగల్

భూసేకరణ కేసుల్లో నష్టపరిహారంపై ఆరు వారాల్లోగా నిర్ణయంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: భూసేకరణ కేసుల్లో నష్టపరిహారాన్ని మళ్లీ నిర్ణయించే విషయమై ఆరు వారాల గడువును విధించాలని, ఈ మేరకు ఆంధ్రప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కర్నూలు జిల్లా కందకూరుకు చెందిన ఎస్ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోదండరామ్ విచారించి ఈ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు సకాలంలో నష్టపరిహారం నిర్ణయంపై తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోందని హైకోర్టు పేర్కొంది. 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం చెల్లింపులో ఆలస్యం జరగడం వల్ల 15 శాతం వడ్డీని ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందన్నారు. ఆలస్యం వల్ల వడ్డీని ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందనే విషయమై ప్రభుత్వ యంత్రాంగంలో అవగాహన కల్పించాలని హైకోర్టు కోరింది. తన భూమి అనంతపురం జిల్లాలో ఉందని, జాతీయ రహదారి వెడల్పు నిమిత్తం, తన భూమిని తీసుకున్నారని, నష్టపరిహారాన్ని మళ్లీ నిర్ణయించాలని కోరానని, ఈ దరఖాస్తు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. తాను కలెక్టర్‌కు 2016 ఆగస్టు 4వ తేదీన దరఖాస్తు చేశానని, 18 నెలలు గడచినా దరఖాస్తు పెండింగ్‌లో ఉందన్నారు. 36 వారాల్లోగా ఈ పిటిషనర్ పెట్టుకున్న పిటిషన్‌ను పరిష్కరించాలని హైకోర్టు అనంతపురం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.