క్రైమ్/లీగల్

ప్రణయ్ హత్య కేసులో 1,600 పేజీల చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, జూన్ 12: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గత ఏడాది సెప్టెంబర్ 14న ప్రేమ వివాహం చేసుకున్న దళిత యువకుడు పీ.ప్రణయ్‌కుమార్ హత్య కేసులో పోలీసులు 1,600 పేజీల చార్జిషీటును సిద్ధం చేసి నల్లగొండ కోర్టులో సమర్పించేందుకు బుధవారం వెళ్లారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్‌కుమార్ హత్యలో పోలీసు అధికారులు అన్ని కోణాల నుండి దర్యాప్తు కొనసాగించారు. ప్రాథమిక సమాచార నివేదికలో ఉన్న నిందితులను చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఉన్న వారిని తగ్గించ లేదు, కొత్తవారిని చేర్చలేదు. సాంకేతిక పరంగా చేసిన విచారణ, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను ఆధారంగా చార్జిషీట్ రూపొందించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతిరావు, తిరునగరు శ్రవణ్‌కుమార్, ఎండీ.కరీం, అస్గర్‌అలీ, అబ్దుల్‌బారీ, శివలను అరెస్టు చేశారు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరిపిన అనంతరం డీఎస్‌పీ పీ.శ్రీనివాస్, వన్‌టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్.సదానాగరాజు చార్జిషీట్‌ను తయారు చేసి నల్లగొండలో సమర్పించేందుకు బుధవారం బయలుదేరారు.

చిత్రం... 1600 పేజీల చార్జిషీట్‌ను నల్లగొండ కోర్టుకు తరలిస్తున్న పోలీసులు