క్రైమ్/లీగల్

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ములుగు, జూన్ 12: విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడుల్లో రూ. 34 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మాదారంలో బుధవారం చోటు చేసుకుంది. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పీ మనోహర్, జేడీఏ శ్రావణ్‌కుమార్ అందించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా దామరపల్లికి చెందిన ఆలపాటి శ్రీనివాసరావు ఈ ప్రాంతంలో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తూ వస్తుండగా, మూడు రోజుల క్రితం రూ. 34 లక్షల విలువ చేసే 1365 కిలోల నకిలీ పత్తి విత్తనాలు మాదారం గ్రామానికి తరలించి ఎస్‌కే ఖాదర్ ఇంట్లో దాచిపెట్టాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం బుధవారం తెల్లవారుజామున విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పీ మనోహర్ నేతృత్వంలో విజిలెన్స్ సీఐలు వినాయక్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డిలతో పాటు సిబ్బంది ఏకకాలంలో దాడి చేశారు. దీంతో రైతులకు విక్రయించడానికి పల్లవి, గోకుల కృష్ణ పేరు గల పత్తి ప్యాకెట్లలో సిద్ధం చేస్తున్న ఆలపాటి శ్రీనివాసరావు, శాకారం గ్రామానికి చెందిన శాగంటి కృష్ణ, అంబర్‌పేటకు చెందిన వేల్పుల కృష్ణ, గిర్మాపూర్‌కు చెందిన గుడికాటి మహేశ్, దండుపల్లికి చెందిన క్యాస రవీందర్, చందాపూర్‌కు చెందిన శౌరయ్యలు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల కంటబడ్డారు. వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు నిలువ ఉన్న 1365 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 3033 పల్లవి, గోకులకృష్ణల పేరిట ఉన్న కవర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో జేడీఏ శ్రావణ్‌కుమార్, ములుగు ఏడీఏ అశోక్‌కుమార్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.
నిందితులపై పీడీ యాక్టు ప్రయోగం
నిబంధనలకు విరుద్ధంగా నకిలీ పత్తి విత్తనాలను గుంటూరు ప్రాంతం నుండి సరఫరా చేసిన శ్రీనివాసరావుతో పాటు ఇతర నిందితులపై పీడీ యాక్టుతో పాటు 420 చీటింగ్ కేసు నమోదు చేస్తున్నట్టువిజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఎస్‌పీ మనోహర్, జేడీఏ శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. నిందితులకు ఏడాది జైలుశిక్షతో పాటు రూ. లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
చిత్రం...స్వాధీనం చేసుకున్న నకిలీ పత్తి విత్తనాలతో పాటు నిందితులను చూపిస్తున్న అధికారులు