క్రైమ్/లీగల్

టెంపో, ఆటో ఢీ : ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలమనేరు, జూన్ 12: చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ సమీపంలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి ఆంజనేయస్వామి ఆలయం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో పదిమంది గాయపడ్డారు. టెంపో ఆటోను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు పలమనేరుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆటోలో బంగారుపాళ్యం టేకుమందకు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన టెంపో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న టేకుమంద గ్రామానికి చెందిన కృష్ణప్పగౌడు(35) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే 108వాహనంలో గాయపడిన వారిని పలమనేరు ఆసుపత్రికి తరలించారు. వీరిలో గంగవరం మండలం బండమీద జర్రావారిపల్లికి చెందిన రెడ్డెమ్మ(32), వెంకటప్ప(70) ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి పొందారు. ఆటోలో ఉన్న పద్మావతి, అమరావతి, భాగ్యమ్మ, నందీష్, శ్రీనివాసులు, నిషార్ బాష, కృష్ణమ్మ, రాజేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కోలారు ఆసుపత్రికి తరలించారు. అతివేగం ప్రమాదానికి కారణమని, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.