క్రైమ్/లీగల్

గంజాయి విక్రేత అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 13: మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ. 68 వేల నగదు, రూ. 35 వేల విలువ చేసే నిషేదిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ ఎక్సైజ్ సీఐ జగన్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మోత్కూరు గ్రామానికి చెందిన అంబటి మహేశ్(25) గురువారం మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద అనుమానస్పదంగా తిరుగుతుండగా ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిజం బయటపడింది. మండలం ఘణాపూర్ గ్రామానికి చెందిన సంజ య్ యాదవ్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలుపడంతో, పోలీసులు మహేశ్ తనిఖీ చేయగా అతని వద్ద నుంచి 4,380 కేజీల రెండు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నిషేదిత గంజాయి విలువ రూ. 35 వేల వరకు ఉంటుందని దీంతో పాటు రూ.68240 నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
నేరేడ్‌మెట్, జూన్ 13: గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత గుట్కా, జర్ధా ప్యాకెట్లను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మల్కాజిగిరి పరిధిలోని వౌలాలి బస్సు స్ట్ఫా సమీపంలో గౌరిశెట్టి శంకర్(50), రాఘవేంద్ర కిరాణ జనరల్ స్టోర్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. వివిధ కంపెనీలకు చెందిన నిషేధించబడిన గుట్కా ప్యాకెట్లను గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు గురువారం దుకాణంపై దాడి చేసి 50 వేల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని శంకర్‌ను అరెస్టు చేసినట్టు తెలిపారు.