క్రైమ్/లీగల్

జయప్రద రిట్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 8: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆజంఖాన్ ఎన్నికను సవాల్ చేస్తూ బీజేపీ అభ్యర్థి జయప్రద దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ శుక్రవారం కొట్టి వేసింది. ప్రాదేశిక పరిథి లేని కారణంగానే రిట్ పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తులు రంజన్‌రాయ్, ఎన్‌కే జౌహన్‌తో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. రాంపూర్ ప్రాంతం అలహాబాద్ హైకోర్టు పరిథిలోకి వస్తుందని, దీని దృష్ట్యా లక్నో హైకోర్టులో పిటిషన్ చెల్లదని తెలిపారు. అలాగే ఈ కేసులో రిట్ పిటిషన్ విచారణార్హం కాదని కేవలం ఎన్నికల పిటిషన్‌ను మాత్రమే దాఖలు చేయాలని న్యాయస్థానం తెలిపింది.