క్రైమ్/లీగల్

వీసీ హత్య కుట్ర భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 31: సెంట్రల్ యూనివర్సిటీ (హైదరాబాద్) వైస్ ఛాన్సలర్ ఆచార్య పి అప్పారావును హతమార్చడానికి జరిగిన కుట్రను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కుట్ర పన్నిన మావోయిస్టు సానుభూతిపరులైన అదే యూనివర్సిటీకి చెందిన ఇద్దరు పూర్వ విద్యార్థులను అరెస్టుచేశారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ శనివారం కాకినాడలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కీసరపల్లికి చెందిన పృథ్వీరాజ్, పశ్చిమబెంగాల్‌లోని హౌరాకు చెందిన చందన్‌కుమార్ మిశ్రాలు గతంలో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అనంతరం వీరు మావోయిస్టు కార్యకలాపాలకు ఆకర్షితులయ్యారు. ఇదే విశ్వవిద్యాలయానికి చెందిన రోహిత్ వేముల గతంలో ఆత్మహత్యకు పాల్పడటం వీరిని కలచివేసింది. సాంఘిక అసమానతల కారణంగానే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు వీరిద్దరూ భావించారు. సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావే రోహిత్ ఆత్మహత్యకు కారణమని వీరిద్దరూ గట్టిగా నమ్మారు. దీంతో బాంబు పేల్చడం ద్వారా వీసీని హత్య చేయాలని వ్యూహరచన చేశారు. దీనితో దేశవ్యాప్తంగా కలకలం లేపవచ్చని భావించారు. ఈ ప్రణాళిక అమలుకు దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కమ్యూనిజం, మావోయిస్టు సాహిత్యాన్ని ఆకళింపుచేసుకుని, విప్లవ రచయితల సంఘం (విరసం) సహా వివిధ ప్రజాసంఘాలతో పరిచయాలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకులు హరిభూషణ్, చంద్రన్నను కలవడానికి మావోయిస్ట్ కేంద్ర కమిటీ నుండి వారికి ఆహ్వానం అందింది. ఆంధ్రా-్ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో వారిని కలవడానికి ఇటీవల రెండురోజుల పాటు మకాంవేశారు. శుక్రవారం పిచ్చుకలపాడు టి జంక్షన్ వద్ద వాహనాలను తనిఖీచేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న వీరిరువురిని గమనించి, వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జరిపిన విచారణలో సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావును హతమార్చడానికి వ్యూహం పన్నినట్టు అంగీకరించారు. ఈమేరకు నిందితులను అరెస్ట్‌చేసి విచారిస్తున్నట్టు ఎస్పీ విశాల్‌గున్నీ వివరించారు.

చిత్రం..నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ విశాల్‌గున్నీ