క్రైమ్/లీగల్

నీట్ ‘కీ’లో జోక్యం చేసుకోలేం తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు * హైకోర్టుకు వెళ్లొచ్చని సలహా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్-2019 ప్రశ్నాపత్రం ‘కీ’ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై కింది కోర్టుకు వెళ్లేందుకు పిటిషనర్‌కు అత్యున్నత ధర్మాసనం వెసులుబాటు కల్పించింది. ఇటివల జరిగిన నీట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రంలోని కొన్ని ప్రశ్నలు ఇబ్బందికరంగా ఉన్నాయని, దాని ద్వారా ఫలితాల్లో తాము నష్టపోయామంటూ హైదరాబాద్‌కు చెందిన రోహన్‌రెడ్డితో పాటు పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని జస్టిస్ అజయ్ రస్టాగీ ,జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. విద్యార్థుల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ నీట్ పరీక్షలలో ఇచ్చిన ప్రశ్నలకు ‘కీ’ తప్పుల తడకగా ఉన్న జాబితాను విడుదల చేసిందని వాదించారు. అలాగే ప్రశ్నా పత్రంలో ఇచ్చిన ప్రకారం ఐదు ప్రశ్నలకు నాలుగు మార్కులను ‘కీ’లో మాత్రం వేరే విధంగా ఇచ్చారని వాదించారు. ఇలా రెండు విధాలుగా ఇచ్చి పరీక్ష బోర్డు విద్యార్థులును ఇబ్బందులకు గురిచేసిందని న్యాయ స్థానానికి వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం నిపుణుల కమిటీ లోతుగానే అధ్యయనం చేసి ప్రశ్నా పత్రానికి జవాబులు విడుదల చేసిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ విషయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం వెల్లడించింది. దీనిపై లోతైన విచారణ చేసేందుకు హైకోర్టుకు వెళ్లేందుకు పిటిషనర్‌కు అనుమతి ఇచ్చింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైనది. ఈ పిటిషన్ వచ్చే సోమవారం విచారణకు రానుంది.