క్రైమ్/లీగల్

జనచైతన్య అధినేత సుధాకర్‌కు రెండేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), మార్చి 31: గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ రంగంలో ఆధిక్యతను చాటుకున్న జనచైతన్య సంస్థల అధినేత మాదల సుధాకర్‌కు తన మొదటి భార్యను వేధించిన కేసులో రెండేళ్ల జైలుశిక్ష, పదివేల జరిమానా విధిస్తూ గుంటూరు 5వ అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ శనివారం తీర్పు చెప్పారు. సీఐడి పోలీసులు నమోదు చేసిన ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అంజలితో 1985 అక్టోబర్ 31వ తేదీన సుధాకర్‌కు వివాహమైంది. వివాహం సందర్భంగా అంజలికి పుట్టింటివారు అప్పట్లో రెండులక్షల నగదు, 560 గ్రాముల బంగారం, ఇతర లాంఛనాలు అందజేశారు. తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారంచేసి సుధాకర్ కోట్లు గడించారు. అయితే అప్పటి నుండి అంజలి పట్ల సుధాకర్, ఆయన తల్లి మాదల శకుంతల, తదితర కుటుంబ సభ్యుల వైఖరి మారింది. నిర్లక్ష్య ధోరణితో పాటు ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ అదనపు కట్నం తేవాలని, లేకపోతే సుధాకర్‌కు మరో వివాహం చేస్తామని అత్తింటి వారు బెదిరించారు. అంతటితో ఆగకుండా 1994 జూలై 2వ తేదీన దాసరి అంజనాదేవి అనే మహిళను సుధాకర్ రెండో వివాహం చేసుకున్నారు. తన అనుమతిలేకుండా వివాహం చేసుకోవటంతోపాటు వేధిస్తున్నారంటూ అంజలి 1995 డిసెంబర్ 19వ తేదీన హైదరాబాద్ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా గుంటూరు 5వ కోర్టుకు కేసు బదిలీ అయింది. 22 ఏళ్ల విచారణ అనంతరం సుధాకర్‌పై నేరం రుజువైంది. అతని తల్లి శకుంతలపై కేసును కొట్టివేస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు.