క్రైమ్/లీగల్

హైటెన్షన్ వైర్లు తగిలి ఇద్దరి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందివాడ, మార్చి 31: చేపల చెరువుమీద చెట్లు నరకడానికి వెళుతూ ఇద్దరు వ్యక్తులకు విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. నందివాడ ఎస్‌ఐ మణికుమార్ కథనం ప్రకారం అరిపిరాల గ్రామంలో 23 ఎకరాల భూమిని రఘురామరాజు అనే వ్యక్తి లీజుకు తీసుకొని చేపల చెరువు తవ్వుతున్నారు. అదే గ్రామానికి చెందిన పిన్నమశెట్టి శ్రీనివాసరావు(50) అనే వ్యక్తికి చెందిన పొలంలో ఉన్న వేప చెట్లు నరికించడానికి సిద్ధమయ్యాడు. హనుమాన్ జంక్షన్‌కు చెందిన చెట్లు నరికే సనపల చంటి (40) అనే కూలీని మాట్లాడుకున్నాడు. ఇద్దరు బయలుదేరి చెరువు గట్టు ఎక్కుతుండగా రైతు శ్రీనివాసరావు కూడా వెంట నడుస్తున్నాడు. చెరువుగట్టు బాగా ఎత్తుగా ఉండటంతో అంతకు ముందు వేసిన విద్యుత్ హైటెన్షన్ వైర్లు చేతికి అందే ఎత్తులో వేలాడుతున్నాయి. దానిని వారు ఇద్దరు గమనించలేదు. ఈ క్రమంలో కూలీ చంటి భుజం మీద వేసుకుని వెళ్తున్న రంపం వైరుకు తగిలింది. ఆ వైరు ఇద్దర్నీ చుట్టేయడంతో విద్యుదాఘాతానికి ఆ ఇద్దరూ అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. ఈ మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాలను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు.