క్రైమ్/లీగల్

అక్రమ సంబంధానికి నిండుప్రాణం బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, జూన్ 19: ఒక మహిళ అక్రమ సంబంధం వ్యవహారం మరో అమాయకురాలి ప్రాణాలను బలిగొంది. మరిదితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ పెళ్లయ్యాక తనను దూరం పెడుతున్నాడన్న కక్షతో అంతమొందించాలని చేసిన ప్రయత్నం ఆమె ఆడపడుచు ప్రాణాలు తీసింది. మరిది, తోటికోడలు, ఆడపడుచు గదిలో కూర్చొని మాట్లాడుకుంటుండగా ఆమె పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దాడిలో ఆమె ఆడపడుచు హుజున్ని (50) మంటల్లో కాలి మృతి చెందింది. ఈ దారుణ ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సనత్‌నగర్‌లో బుధవారం సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మహ్మద్ ఫరీద్ (40), మహ్మద్ ఖలీల్ (25) అన్నదమ్ములు. కానూరు పరిధిలోని సనత్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఫరీద్ రిక్షా కార్మికుడు కాగా, ఖలీల్ ఆటోనగర్‌లో ముఠాకూలీ. ఐదేళ్లుగా తన వదిన ముంతాజ్ బేగం (35)తో ఖలీల్‌కు అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఫరీద్ మూడు నెలలు క్రితం తమ్ముడు ఖలీల్‌కు నత్రిఫ్ బేగంతో వివాహం జరిపించాడు. తన పెళ్లయినప్పటి నుంచి వదిన ముంతాజ్ బేగంను ఖలీల్ దూరంగా పెట్టాడు. దీంతో మరిది, తోటికోడలిపై ఆమె పగ, ద్వేషం పెంచుకుంది. ఎలాగైనా వారిద్దరినీ చంపాలని పథకం పన్నింది. ఇళ్లు పక్కపక్కన కావడంతో బుధవారం ఉదయం మరిది, తోటికోడలు, ఆడపడుచు మంచంపై కూర్చొని ఉన్న సమయంలో వెనుక నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించింది. గది తలుపు గొళ్లెం పెట్టి అక్కడి నుంచి జారుకుంది. ఈ ఘటనలో ఆమె ఆడపడుచు హుజున్ని మంటల్లో కాలి ప్రాణాలు కోల్పోయింది. 90శాతం వరకు శరీరం కాలిన స్థితిలో ఖలీల్ చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్తను, హుజున్నిని రక్షించాలని ప్రయత్నించిన నత్రీఫ్ బేగంకు స్వల్న గాయాలయ్యాయి. 108లో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే సీఐ వాసా పెద్దిరాజు సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ కుమార్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పెద్దిరాజు వివరించారు.