క్రైమ్/లీగల్

సినిమా ఫక్కీలో ఏటీఎం చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణె, జూన్ 23: గుర్తు తెలియని దుండగులు సినిమా ఫక్కీలో ఏటీఎం సెంటర్‌లోకి చొరబడి నగదు మెషీన్‌ను తరలించుకుపోయిన వైనమిది. పోలీసుల కథనం ప్రకారం.. పూణెకు 60 కిలోమీటర్ల దూరంలోని యావత్ ప్రాంతంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఇండియా ఏటీఎం కేంద్రంలోకి శనివారం అర్ధరాత్రి 1.45 గంటలకు గుర్తుతెలియని దుండగులు ప్రవేశించారు. సీసీ కెమెరాల్లో కనపడకుండా ఉండేందుకు ముందుగా సీసీ కెమెరాలపై బ్లాక్ స్ప్రేను చల్లారు. అనంతరం తమతో తెచ్చుకొన్న వైర్‌తో ఏటీఎం వెండింగ్ మెషిన్‌ను చుట్టారు. పక్కా ప్రణాళికతో తమతో తెచ్చుకొన్న ఎస్‌యూవీ వాహనంలోకి ఏటీఎం మెషిన్‌ను ఎక్కించుకొని ఉడాయించారు. ఎస్‌బీఐ ఏటీఎంలో 30 లక్షల రూపాయిల నగదు ఉన్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
కేసు నమోదు చేసి దుండగులు ఏటీఎంను కొల్లగట్టుకు పోయిన విధానంపై ఆరా తీస్తున్నారు. హై సెక్యూరిటీ ఉన్న ఎయిర్‌పోర్టు తదితర ప్రాంతాలు మినహా మినహా మిగతా చోట్ల ఏటీఎం కేంద్రాలను గోడల్లో కానీ, పిల్లర్లు, నేలలో ఏర్పాటు చేసుకోవాలని.. ఈ ప్రక్రియను సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని రిజర్వు బ్యాంక్ బ్యాంకులను ఆదేశించింది.