క్రైమ్/లీగల్

కేంద్ర మంత్రి తనయుడి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఏప్రిల్ 1: కేంద్రమంత్రి అశ్వినికుమార్ కుమారుడు అరిజిత్ శశ్వత్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఇటీవల భాగల్‌పూర్‌లో జరిగిన మతకల్లోలాల్లో ఇతడి ప్రమేయం ఉన్నదని ప్రధాన ఆరోపణ. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుజగా 14 రోజుల పాటా జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. మార్చి 24న శశ్వత్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దీనిపై ఆయన కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్‌కోసం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం కోర్టు శశ్వత్ అభ్యర్థనను తిరస్కరించిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. శశ్వత్‌ను భాగల్‌పూర్ జైలుకు తరలించినట్టు పాట్నా ఎస్‌పి మను మహరాజ్ తెలిపారు. శశ్వత్‌ను అదనపు ఛీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎ.ఆర్. ఉపాధ్యాయ నివాసానికి తీసుకెళ్లగా, ఆయన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణ ప్రసాద్ తెలిపారు. శశ్వత్ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అశ్వినికుమార్ చౌబే తనయుడు. ‘‘కోర్టు ఆదేశాల తర్వాత నాకునేనే పోలీసులకు లొంగిపోయా. నన్ను అరెస్ట్ చేసినట్టు వారు చెబుతున్న దాంట్లో నిజంలేదు. నేనేం తప్పించుకొని ఎక్కడికీ పారిపోలేదు’’ అని శశ్వత్ విలేఖరులకు తెలిపారు. ‘‘్భరత మాతను, శ్రీరాముడిని కీర్తిస్తూ నినాదాలు చేయడం నేరమైతే, నేను నేరస్థుడినే అవుతాను’’ అన్నారు. ఈ మతకల్లోలాలకు సంబంధించి శశ్వత్‌తో పాటు మరో ఎనిమిదిమంది పేర్లను కూడా పోలీసులు జాబితాలో చేర్చారు.
మార్చి 17న భాగల్‌పూర్‌లో శశ్వత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున మైకుల్లో సంగీతాన్ని వినిపించడంతో, కొంతమంది అభ్యంతరం తెలిపారు. హిందూ క్యాలండర్ ప్రకారం ఆరోజు నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా వేడకలు నిర్వహించారు. అయితే వీటికి పోలీసుల అనుమతి లేదు. ఈ సందర్భంగా రెండు వర్గాలవారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. పెద్ద ఎత్తున దహనకాండ చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి శశ్వత్‌ను అరెస్ట్ చేయడంలో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్, ఆర్‌జెడీలు తీవ్రంగా విమర్శించాయి. నితిశ్ కుమార్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో మెతక వైఖరిని అవలంబిస్తున్నదంటూ వారు ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఈ అరెస్ట్ చోటుచేసుకోవడం గమనార్హం.

చిత్రం..పోలీసుల అదుపులో అరిజిత్ శశ్వత్