క్రైమ్/లీగల్

మూడు నెలలుగా అస్థిపంజరాలై చెట్టుకు వేలాడిన ప్రేమజంట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయిలకొండ, జూన్ 23: ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటామంటే పెద్దలు వద్దంటున్నారని ఇంటి నుంచి వెళ్ల్లిపోయన ఇద్దరు ప్రేమికులు మూడు నెలల తర్వాత గుట్టల ప్రాంతంలో ఉరి వేసుకొని చెట్టుకు వేలాడుతూ ఆదివారం అస్థి పంజరాలుగా కన్పించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయలకొండ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాంపూర్ గ్రామానికి చెందిన రవి (20) డిగ్రీ రెండో సంవత్సరం, అదే గ్రామానికి చెందిన రాధిక (21) డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ తమతమ ఇళ్లలో తమ ప్రేమ గురించి తెలియజేశారు. ఇద్దరి సామాజిక వర్గం ఒకటే అయనా ఇరువురి తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకొలేదు. ఇద్దరు తల్లిదండ్రులు తమ పిల్లలను తీవ్రంగా మందలించారు. దీంతో రవి తన ప్రియురాలికి ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని లేఖ రాశాడు. మార్చి 18వ తేదీ నుండి ఇద్దరూ కనపడకుండా పోయారు. గ్రామంలోని ఇరువురి తల్లిదండ్రులు ఎంతవెతికినా దొరకకపోవడంతో మార్చి 24 తేదీన కోయిలకొండ పోలీస్‌స్టేషన్‌లో రవి తండ్రి వెంకట్రాములు, రాధిక తండ్రి రాములు విడివిడిగా ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మూడు మాసాల తరువాత శనివారం సాయంత్రం రాంపూర్- పారుపల్లి గ్రామాల సరిహద్దులో గల ఎముగనిగుట్ట పైన ఎత్తు ప్రాంతంలో మేకలు కాయడానికి గుట్టపైకి వెళ్లిన కాపరులకు రెండు మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ భయానకంగా కనపడటంతో వెంబడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి మృతులను రవి, రాధిక అని గుర్తించారు. ఇద్దరూ ఒకే చెట్టుకు ఓణీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహలు సైతం అస్థిపంజరాలుగా మారడంతో హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి సంఘటనా స్థలం వద్దే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహలను కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

రవి, రాధిక (ఫైల్ ఫొటోలు)