క్రైమ్/లీగల్

టీచర్ల ఖాతాల నుంచి 1. 60 లక్షలకు టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, జూన్ 24: మండలంలోని ఏటిమొగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు, అతని భార్య బ్యాంకు ఖాతాలు నుంచి గుర్తు తెలియని ఓ అగంతకుడు పెద్ద మొత్తంలో నగదును కైంకర్యం చేసినట్లు ఆలస్యంగా తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక ఎస్‌ఐ చల్లా కృష్ణ సోమవారం విలేఖర్లకు వివరిస్తూ ఇదే మండలంలోని మర్రిపాలెం గ్రామానికి చెందిన మద్ది శ్రీరామకృష్ణ, అతని భార్య భారతిలకు సంబంధించి బ్యాంక్ ఖాతాలకు చెందిన సమాచారాన్ని తెలపాలంటూ సంతోష్ శర్మ పేరుతో పోన్ కాల్ చేసి తాను ఎస్‌బీఐ సీనియర్ మేనేజర్‌ను అంటూ ఈ ఉపాధ్యాయులను నమ్మించి వారికి సంబంధించిన చిప్ బేస్డ్‌కార్డు ఓటీపీ నెంబరును తెలుసుకున్నాడు. అనంతరం వీరు తమ ఖాతాలను పరిశీలించుకోగా రూ.లక్షా 59వేల 890 నగదు మాయమైనట్లు గ్రహించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.