క్రైమ్/లీగల్

దళ సభ్యుడు సహా ఐదుగురు మిలీషియా సభ్యుల లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, జూన్ 25: సీపీఐ మావోయిస్టు పార్టీ కోరుకొండ, పెదబయలు ఏరియా కమిటీకి చెందిన దళ సభ్యుడితో పాటు ఐదుగురు మిలీషియా సభ్యులు మంగళవారం జిల్లా అదనపు ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు( ఆపరేషన్స్) ఎదుట లొంగిపోయారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జి.మాడుగుల మండలం కిల్లంకోట శివారు చింతగొప్పుకు చెందిన దళ సభ్యుడు కొర్రా కృష్ణ అలియాస్ ప్రవీణ్(22) అదే గ్రామానికి చెందిన పాంగి అర్జున్ అలియాస్ గోపాలరావు(25), పెదబయలు మండలం జమదాంగి గ్రామానికి చెందిన గొల్లూరు తాంబ్రూ అలియాస్ మల్లన్న(30), పాంగి నాగేశ్వరరావు అలియాస్ రంగరావు(19), పెదబయలు మండలం కింజరికి చెందిన బౌడు వెంకటేష్ (27)లు లొంగిపోయారన్నారు. వీరంతా మిలీషియా సభ్యులుగా కొనసాగుతున్నారన్నారు. దళసభ్యుడిగా కొర్రా కృష్ణ 2014 నుండి 2017 వరకు మిలీషియా సభ్యుడిగా, 2015 నుండి 2019 వరకు దళ మెంబర్‌గా పని చేసాడన్నారు. 2012లో జి.మాడుగుల మండలం లువ్వాసింగి వద్ద జరిగిన ఎదురు కాల్పులు, 2017లో ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పులు సంఘటనతో పాటు 2015లో రాళ్ళగెడ్డ, దిగుజనభ వద్ద ఎస్సార్ పైప్‌లైన్లు ధ్వంసం చేసిన ఘటనలో పాల్గొన్నట్లు వివరించారు. మిలీషియా సభ్యులైన గొల్లూరి తాంబ్రూ , పాంగి అర్జున్, పాంగి నాగేశ్వరరావు, బౌడు వెంకటేష్, సిరిమి బాలన్నలు ఎదురుకాల్పులకు పాల్పడడం, కరవు దాడులు, ల్యాండ్‌మైన్స్ అమర్చడం, మావోల సభలకు గిరిజనులను బలవంతంగా తీసుకువెళ్ళడం, బ్యానర్లు వెదజల్లడం, కరపత్రాలు వెదజల్లడం, పోలీసుల సమాచారాన్ని మావోయిస్టులకు చేరవేయడం , వారికి అవసరమైన సరుకులు అందజేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడేవారని తెలిపారు.గిరిజన ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు పోలీస్ ఫ్రెండ్లీ కార్యక్రమాలకు ఆకర్షితులై జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకుని స్వచ్చందంగా లొంగిపోయినట్లు అదనపుఎస్పీ వివరించారు. లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వపరంగా సహాయం అందజేస్తామని తెలిపారు.
నలుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్
విశాఖ జిల్లా సీపీ ఐ మావోయిస్టు పార్టీ పెదబయలు ఏరియా కమిటీ మిలీషియా సభ్యులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అదనపు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. మావోయిస్టులకు సహకరిస్తూ పలు విధ్వంస సంఘటనలతో పాటు ఎదురుకాల్పుల్లో పాల్గొన్న వీరందరినీ అరెస్ట్ చేసామన్నారు. అరెస్ట్ అయిన వారిలో పెదబయలు మండలం గుంజువాడకు చెందిన ఈతంగి చిట్టిబాబు(35), ఇంజరి గ్రామానికి చెందిన పోతురంగి కోటిబాబు, గొల్లూరి మోదేశ్వరరావు(25), వంతల కామేశ్వరరావు(25)లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు అదనపు ఎస్పీ కృష్ణారావు తెలిపారు.
చిత్రం... అదనపు ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు